|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 03:10 PM
ఈ రోజు దసరా పర్వదినం సందర్భంగా మాస్జిద్ బండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు మారబోయిన రవి యాదవ్ గారిని కలసి హృదయపూర్వకంగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.నాయకులు మారబోయిన రవి యాదవ్ గారిని శాలువాలతో గౌరవించి, మిఠాయిలు పంపిణీ, అలై బలై చేయించి ఉత్సాహంగా దసరా ఉత్సవాన్ని జరుపుకున్నారు. వారి ఆదరణకు మారబోయిన రవి గారు కృతజ్ఞతలు తెలిపారు.రవి యాదవ్ మాట్లాడుతూ.......దసరా అనేది సాంఘిక ఐక్యత, ధర్మం మరియు శ్రద్ధకు కేంద్రమైన పండుగ. ప్రజల ఆశీర్వాదమే నా బలం. సంక్షేమకార్యాలు, ప్రజాసేవ మరియు యువతకు అవకాశాల సృష్టిలో నేను నిరంతరం కృషి చేస్తాను. మీ మద్దతు, సహకారంతోనే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచగలము.” వారి ఆదరణకు మారబోయిన రవి గారు కృతజ్ఞతలు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కే.ఎన్.రాములు, ప్రభాకర్ గౌడ్, వెంకట్ రెడ్డి, వెంకట చారి, గడ్డం శ్రీనివాస్, వాకిటి శంకర్, కొండకల్ శ్రినివాస్, జంగయ్య, నవీన్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, స్వామి ముదిరాజ్, వెంకట్, సజుభాయ్, సైదులు, ఎల్ల స్వామి, శామప్ప, తదితరులు పాల్గొన్నారు..