|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 12:50 PM
జడ్చర్ల పట్టణంలో గుట్టుగా గత ఆరు నెలల నుండి స్పా మసాజ్ పేరుతో ఇతర ప్రాంతాల నుండి అమ్మాయిలను రప్పించి అద్దె రూమ్‌లో స్పా మసాజ్ క్రాస్ మసాజ్‌తో పాటు వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు. కాగా తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన అహ్మద్ అలీని రిమాండ్ చేసినట్లు జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ తెలిపారు. పట్టణంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఇంకా ఎక్కడైనా జరుగుతున్నాయా? అనే కోణంలో విచారణ చేపడుతున్నామని వెల్లడించారు. ఇలాంటి అసాంఘిక సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు చేపడతామని అన్నారు. పట్టణంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు ఎవరికీ అనుమానం వచ్చినా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సీఐ పట్టణ ప్రజలకు సూచించారు. పట్టణంలో నిర్వహిస్తున్న ప్రతి లాడ్జిపై ప్రత్యేక నిఘా పెడతామని సీఐ కమలాకర్ తెలిపారు.