|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 02:42 PM
ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ నుండి మెడికల్ వెస్ట్, జిహెచ్ఎంసి చెత్తను అక్రమంగా డంపింగ్ చేస్తున్నారని టిడిపి పార్టీ ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆరోపించారు. సోమవారం చెరువును సందర్శించిన ఆయన, జిహెచ్ఎంసి వాహనాలు చెరువులో చెత్త నింపకుండా సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ డంపింగ్ వల్ల చెరువు కలుషితమవుతోందని ఆయన తెలిపారు.