|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 02:41 PM
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)పై ఓ కారు పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న సౌమ్యా రెడ్డి అనే యువతి దుర్మరణం పాలైంది.
ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారు నంద కిశోర్, వీరేంద్ర, ప్రనీష్, అరవింద్, సాగర్, ఝాన్సీ, శ్రుతిలు. వీరంతా సరళ మైసమ్మ ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓఆర్‌ఆర్‌పై ఉన్నత వేగంతో వెళ్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి పల్టీలు కొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమవ్వగా, ప్రయాణికులందరూ కింద పడిపోయారు. స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని ఆసుపత్రిలో గుర్తించారు. ప్రమాదవార్త తెలియగానే కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి.