|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 12:46 PM
వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించిందని, వీటి ద్వారా 10321 కేసులు పరిష్కారమయ్యాయని, సైబర్ క్రైమ్ కేసుల్లో 83 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు జారీ వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన మొత్తం కేసుల్లో కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు -1079, ఈ పెట్టి కేసులు - 6012, డ్రంకెన్ అండ్ డ్రైవ్ మరియు, మోటార్ వెహికల్ చట్టం కేసులు - 3003, సైబర్ కేసులు -227 పరిష్కరించడం ద్వారా బాధితులకు సంబంధించి వివిధ బ్యాంక్ ఖాతాల్లో నిలుపుదల చేసిన 83,48,202 రూపాయలు బాధితులకు అందజేశాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు వెలుబడించిందని తెలిపారు.రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించి కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బంది పోలీస్ కమిషనర్ అభినందించారు. అదేవిధంగా లోక్ అదాలత్ సద్వినియోగం సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయసేవాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.