|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 03:00 PM
ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన నంద్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఏడాదిన్నర పాపతో అర్థరాత్రి రైలు దిగిన ఓ మహిళ ఆళ్లగడ్డ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ బయట ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ సమర సింహ ఆటోను దారి మళ్లించి మహిళపై అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. కాగా సమరసింహ ఎంటెక్ చదివి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పనిచేసేవాడు. కుటుంబ సమస్యల కారణంగా నంద్యాలలో ఆటో నడుపుతున్నాడు.