|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 11:23 AM
వర్షం పడినప్పుడు వరద తొలగింపు.. మిగతా సమయంలో పూడికను తొలగించడం పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. వర్షాకాలం ఆరంభానికి ముందు నుంచి పూడిక తొలగింపు జరుగుతుండగా.. మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లు అందుబాటులోకి వచ్చిన జులై 1వ తేదీ నుంచి హైడ్రా కార్యక్రమం మరింత వేగాన్ని అందుకుంది. ఇలా ఇప్పటి వరకూ 15665 క్యాచ్‌పిట్లను హైడ్రా క్లీన్ చేసింది. 359 కల్వర్టులలో పూడికను హైడ్రా తొలగించింది. 1670 చోట్ల నాలాల్లో చెత్తను బయటకు తీసి తరలించింది. ఇలా 4609 వాటర్ లాగింగ్ పాయింట్లను హైడ్రా క్లియర్ చేసింది. వీటికి తోడు.. వర్షాల వేళ 4974 ప్రాంతాల్లోపేరుకుపోయిన చెత్త ను తొలగించింది. ఇలా మొత్తం 27,272 చోట్ల చెత్త, పూడిక తొలగింపు పనులను జులై ఆరంభం నుంచి ఆగస్టు 21వ తేదీ వరకూ చేసింది. హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమాలను నిర్వహించి వరద కాలువలు, నాలాల పరిరక్షణలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తోంది. నాలాల్లో చెత్త వేయకుండా పర్యవేక్షించాలని వారిలో చైతన్యం నింపుతోంది.
వర్షం పడిందంటే చాలు నగరంలో చెట్లు నేలకొరుగుతున్నాయి. రహదారులకు అడ్డంగా పడి వాహన రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయంగా మారుతున్నాయి. జోరున వర్షం పడుతుండగానే పడిపోయిన చెట్లను తొలగించాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడినప్పుడు హైడ్రా భారీ వాహనాలు వెళ్లలేని పరిస్థితులుంటే.. బైకులపై వెళ్లి చెట్టు కొమ్మలను కట్ చేసి తొలగించేలా హైడ్రా చర్యలు తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి మొత్తం 810 చెట్లను తొలగించింది హైడ్రా. భారీ వృక్షాలు పడినప్పుడు డీఆర్ ఎఫ్ వాహనాలు రంగంలోకి దిగి తొలగిస్తాయి. వీటికి తోడు గణేష్ ఉత్సవాలు సందర్భంగా విగ్రహాలు తరలించినప్పుడు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను హైడ్రా తొలగిస్తోంది