|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 11:33 AM
TG: పార్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భారీ షాక్ తగిలింది. ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై వచ్చే వారం నుంచి విచారణ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ ఐదుగురి విచారణ తరువాత మిగతా ఐదుగురికి కూడా నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం. అయితే, తమకు నోటీసులు అందాయని, చట్టాన్ని గౌరవిస్తామంటూ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఫిరాయింపు నేతలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారా? లేక రాజీనామా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.