|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 11:15 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ హాస్టల్‌లో అత్యంత హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ మీద కోపంతో ఒక సైన్స్ టీచర్ మంచి నీళ్ల ట్యాంక్‌లో పురుగుల మందు కలిపింది. ఆ కలుషితమైన నీళ్లు తాగిన 13 మంది విద్యార్థులు, ఒక టీచర్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అస్వస్థతకు గురైన వారిని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులపై ఇలాంటి దాడికి పాల్పడిన సైన్స్ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.