|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 10:39 AM
ఫరూక్ నగర్ మండలంలోని అన్నారం గ్రామంలో జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనుల జాతరను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎంపీడీవో బన్సీలాల్ ఆధ్వర్యంలో అంగన్వాడి, మహిళా సంక్షేమ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి.