|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 10:33 AM
కొండమల్లేపల్లి మండల పరిధిలోని కొర్రోనితండాలో ఈ నెల 18న జరిగిన చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. శుక్రవారం సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, బద్దు అనే నిందితుడు అర్ధరాత్రి ఎవరూ లేని ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసి, కిలో వెండి ఆభరణాలు, లక్షా 30 వేల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించినట్లు తెలిపారు.