|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 12:25 PM
యాదాద్రి జిల్లాలో వడ్లు కొనకుండానే లెక్కల్లో చూపి సర్కారు డబ్బును అక్రమంగా తీసుకున్న ఘటన బయటపడింది. వలిగొండ మండలం సంగెం పీఏసీఎస్ సెంటర్ ఇన్‌చార్జి ఉమారాణి, ఆపరేటర్లు శేఖర్, బాలకృష్ణ రూ.4.64 లక్షలు తమ అకౌంట్లకు మళ్లించారు. విచారణలో విషయం వెల్లడవగా, కలెక్టర్ ఆదేశాలతో బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసి, కేసులు నమోదు చేసి డబ్బు రికవరీ చేస్తున్నారు.