|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 12:14 PM
TG: ఇన్నోవా కారులో వచ్చి ఆవులను అపహరించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. బండిమెట్ ప్రాంతంలో ఆవుల దొడ్ల వద్దకు వచ్చిన దుండగులు.. వాటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి కారు వెనుక భాగంలో వేసుకొని పరారయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మారేడుపల్లిలో కూడా నిన్న రాత్రి ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.