|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 03:35 PM
బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన AIG హాస్పిటల్స్‌ను CM రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "డాక్టర్లకు నా విజ్ఞప్తి.. ఏడాది పొడవునా మీరు మీకు నచ్చిన స్థలంలో, నచ్చిన జీతంతో మంచి జీవితం గడపండి. కానీ ఆ ఏడాదిలో కనీసం ఒక్క నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయండి. ఇది మీ సామాజిక బాధ్యతగా పరిగణించండి. ఆ ఒక్క నెల పేదలకు అందించే సేవలు మీకు ఆనందాన్నిస్తాయి’’ అని అన్నారు