|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 12:46 PM
చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన మరో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ముందు ఉన్న కారు అదుపు తప్పి రోడ్డుపై నడుస్తున్న వ్యక్తి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.