|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 12:45 PM
పాల్వంచ మండలం మందరికలపాడు గ్రామానికి చెందిన కోరం కరుణ(23) పురిటినొప్పులతో బాధపడుతూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ కోసం వైద్య సిబ్బంది ఆమెతో వ్యాయామం చేయించారు. నార్మల్ డెలివరీ కాకపోవడంతో ఆపరేషన్ చేశారు. కాగా హార్ట్ బీట్ ఆగిపోయిందని, శిశు మరణించిందని వైద్యులు నిర్ధారించారు. వైద్యులు ఆలస్యం చేయటం వల్లే గర్భంలో శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు.