![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 08:26 PM
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆత్మకూరు మండలంలోని తుక్కాపురం గ్రామంలో సీసీ రోడ్డు పనులకు,కూరేళ్ళ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు,పుల్లాయిగూడెం గ్రామంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసి కప్రాయిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు మరియు వాటర్ ఫిల్టర్ ప్రారంభించారు.రాఘవాపురం గ్రామంలో సీసీ రోడ్డుకు, దుప్పల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు,నర్సాపురం గ్రామంలో సీసీ రోడ్డు పనులకు,లింగరాజుపల్లి గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు శంకుస్థాపన చేశారు.పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు.అదేవిధంగా పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.దుప్పలి ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు సందర్శించారు.పాఠశాలలో నిర్వహిస్తున్న డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించారు,ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు,విద్యార్థులు కోరిన మేరకు నూతన వాటర్ ప్లాంట్ ను బీర్ల ఐలయ్య గారు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఐలయ్య గారికి ధన్యవాదాలు తెలిపారు.