|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 08:10 PM
గత BRS ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం వల్లే భూ సమస్యలు పెరిగాయని.. అందుకే ధరణిని బంగాళాఖాతంలో వేశామని DyCM భట్టి విక్రమార్క అన్నారు. భూభారతి చట్టం ద్వారా అసైన్డ్ భూములు అర్హులకు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అసైన్ కమిటీలు మళ్లీ ప్రారంభిస్తామని.. భూమిలేని పేదలకు సాగు భూమి, ఇళ్ల స్థలాల హక్కు ఉంటుందని తెలిపారు. ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు, గ్రామ సభల ద్వారా భూ వివరాల స్పష్టత ఉండేలా చూస్తామన్నారు.