|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 02:05 PM
కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ . కేసీఆర్‌తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు కూడా నోటీసులు జారీ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. 15 రోజుల్లో కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న కమిషన్.కేసీఆర్ జూన్ 5న, హరీశ్‌రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్.. నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీకంట్రోల్, పే అండ్ ఎకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణసంస్థల ప్రతినిధులు.. ఇలా అందరినీ విచారించింది.