|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 11:55 AM
రాష్ట్రంలో మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య. ఆర్ఆర్ఆర్ భూసేకరణలో అన్యాయం జరిగిందని ఒకరు, అప్పుల బాధతో మరొకరు ఆత్మహత్య . సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ముక్తమసాన్ పల్లె గ్రామానికి చెందిన రైతు కంటి నర్సింహులు (45) రెండెకరాల భూమిని రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణలో భాగంగా సేకరిస్తున్న ప్రభుత్వం . భూసేకరణ పరిహారం విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో, గత కొన్ని నెలలుగా ఆర్డీవో కార్యాలయం, నేషనల్ హైవే కార్యాలయం చుట్టూ తిరుగుతున్న నర్సింహులు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం రాదనే ఆందోళనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న నర్సింహులు అదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం సుందరగిరి గ్రామానికి చెందిన కొక్కుల లచ్చన్న (56) తనకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యి, తన పొలంలోని చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న లచ్చన్న