|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 03:10 PM
మరికల్ మండల కేంద్రంలో బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో మాట్లాడిన మండల బీజేపీ అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ, శంభాజీ మహారాజ్ శివాజీ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని, మరాఠా సామ్రాజ్యాన్ని బలపరిచిన గొప్ప యోధుడిగా చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన ధైర్యసాహసాలు, దేశభక్తి ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చే విధంగా ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహారాజ్ సేవలను గుర్తుచేసుకున్నారు. దేశభక్తి భావనలు యువతలో పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు కీలకమని వారు అభిప్రాయపడ్డారు.