![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 05:22 PM
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని టాలెంటెడ్ సుజీత్ దర్శకత్వంలో చేస్తునట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'OG' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా యొక్క షూటింగ్ ని ప్రారంభించారు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా యొక్క మెయిన్ షెడ్యూల్ ని మేకర్స్ విజయవాడలో ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ షెడ్యూల్ మేకర్స్ జూన్ 16న పూర్తి చేననున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో జాపనీస్ నటుడు కాజుకి కీటమురా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
Latest News