|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 09:08 AM
బిగ్‌బాస్ - 7 సీజన్లో ఐదోవారం ఎలిమినేషన్ పూర్తయింది. ఆదివారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. గౌతమ్, శుభశ్రీ రాయగురు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే తాను ఎలిమినేట్ కావడానికి అమర్‌దీప్ కారణమని, అతనొక మోసగాడని శుభశ్రీ చెప్పింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘‘హౌస్‌లో చాలారోజులు ఉంటాననే నమ్మకంగా ఉన్నా. ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అనుకోలేదు. గత రెండు వారాలుగా బాగా ఆడాను. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉన్నా. షోలో నా పెర్‌ఫార్మెన్స బయటకు ఏం వెళ్లిందో.. ఏం వెళ్లలేదో తెలియదు. టాస్క్‌ల పరంగా చాలా ఫోకస్‌గా ఉన్నా. ఇప్పుడు హౌస్‌ను చాలా మిస్ అవుతున్నా. ముఖ్యంగా డీలక్స్ రూమ్‌లో నేను రెడీ అయ్యే కార్నర్ ప్లేస్‌ను మాటిమాటికి గుర్తొస్తుంది. అందరూ అక్కడికే వస్తారు. మొదటి నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతున్నారు. చివరకు మేం ముగ్గురమే మిగిలాం. ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అవుతుందని ఊహించలేదు. తేజ, శివాజీ, అమర్‌దీప్‌లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నా. ఎలిమినేషన్ కారణంగా నా మనోభావాలు దెబ్బతిన్నాయి’’అని నవ్వుతూ చెప్పింది శుభశ్రీ.
Latest News