|
|
by Suryaa Desk | Mon, Oct 13, 2025, 06:14 PM
మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'త్రిబాణధారి బార్బరిక్'. విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, సత్యరాజ్ .. ఉదయభాను .. వశిష్ఠ సింహా ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 29వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఆ సమయంలో దర్శకుడు రిలీజ్ చేసిన ఒక వీడియో కారణంగానే ఈ సినిమా టైటిల్ జనంలోకి వెళ్లింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: శ్యామ్ (సత్యరాజ్) ఓ మానసిక వైద్య నిపుణుడు. కొడుకు - కోడలు ఒక ప్రమాదంలో చనిపోవడంతో, మనవరాలు 'నిధి'తో కలిసి హైదరాబాదులో నివసిస్తూ ఉంటాడు. 14 ఏళ్ల 'నిధి' ఒక స్కూల్లో చదువుతూ ఉంటుంది. నిధికి ఒకసారి ఆయన 'బార్బరిక్' నాటకాన్ని చూపిస్తాడు. మూడు బాణాలతో బార్బరికుడు అనుసరించే విధానం ఆయనకి నచ్చుతుంది. ఆ నాటకం నిధిపై కూడా ప్రభావాన్ని చూపుతుంది.హైదరాబాదులో వాకిలి పద్మ (ఉదయభాను) డాన్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. దేవ్ ఆమెకి మేనల్లుడు. అతనికి తన కూతురు మహాలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయాలని పద్మ భావిస్తుంది. దేవ్ స్నేహితుడే రామ్ (వశిష్ఠ ఎన్ సింహా). అతను సత్య అనే యువతిని లవ్ చేస్తూ ఉంటాడు. లైఫ్ లో సెటిల్ కావడం కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం, ఆలోచన చేస్తూ ఉంటాడు. తుపాను కారణంగా హైదరాబాదులో వర్షం కురుస్తూ ఉంటుంది. చీకటి పడుతున్నా నిధి ఇంటికి రాకపోవడంతో, ఆమె తాత శ్యామ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. అతనితో కలిసి నిధిని వెతకడం కోసం కానిస్టేబుల్ చంద్ర (సత్యం రాజేశ్) బరిలోకి దిగుతాడు. చివరిసారిగా నిధి ఓ కుర్రాడితో కనిపించిందని తెలుసుకుంటారు. ఆ కుర్రాడు ఎవరు? నిధి ఏమైపోతుంది? ఆమె క్షేమంగా తిరిగొస్తుందా? అనేది మిగతా కథ.
Latest News