|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 04:59 PM
కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం బీహార్ లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన మహాఘట్‌బంధన్ ఉమ్మడి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. "ఆయనకు (మోదీకి) కేవలం మీ ఓటు మాత్రమే కావాలి. ఓట్ల కోసం డ్రామా చేయమంటే చేస్తారు. మీరేమైనా చేయించగలరు. నరేంద్ర మోదీని డ్యాన్స్ చేయమన్నా చేస్తారు" అంటూ రాహుల్ విమర్శించారు."వారు మీ ఓట్లను దొంగిలించే పనిలో ఉన్నారు. మహారాష్ట్ర, హర్యానాలలో ఎన్నికలను దొంగిలించారు. ఇప్పుడు బీహార్‌లోనూ అదే ప్రయత్నం చేస్తారు" అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదిలా ఉండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బుధవారం బేగుసరాయ్, సమస్తిపూర్, దర్భంగాలలో ఎన్డీఏ తరఫున ప్రచార ర్యాలీలు నిర్వహించారు.