|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 04:58 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మహమ్మద్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు బీజేపీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి శంకర్ తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని వారు ఆరోపించారు. ఒక వర్గం ఓట్ల కోసమే హడావుడిగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారని విమర్శించారు. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. మంత్రివర్గ విస్తరణను నిలిపివేయాలని కోరారు.