|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 03:50 PM
రాష్ట్ర ఎన్నికల కమిషన్ అతి తక్కువ ఫీజుతోనే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు వివిధ కేటగిరీలలో డిపాజిట్ మొత్తాలను నిర్ణయించారు. మొదటి విడతలో 31 జిల్లాల్లో 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 15న ఉపసంహరణ, 23న పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడతలో 13న నామినేషన్లు స్వీకరించి, 19 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చి, 27న పోలింగ్ నిర్వహిస్తారు.