|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 12:20 PM
బతుకమ్మకుంట ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారిందని శ్రీ వీహెచ్ గారు అన్నారు. ప్రారంభోత్సవం నాటి నుంచి నేటి వరకూ అక్కడ ప్రతి రోజు సాయంత్రం సందడి వాతావరణం నెలకుంటోందని.. వందలాది మంది వచ్చి బతుకమ్మ ఆడారన్నారు. వచ్చే ఏడాది మరింత వైభవంగా బతుకమ్మ ఆటలు ఆడుతారని.. ఈ నేపథ్యంలో చెరువు అందాలు ఏమాత్రం దెబ్బతినకుండా చూడాలని కోరారు. ప్రస్తుతం బతుకమ్మకుంటలో ఉన్న బోటు షికారును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. చెరువును చూడడానికి స్థానికేతరులు కూడా వస్తున్నారన్నారు. బతుకమ్మ కుంట సందర్శన, వ్యాయామ సమయాలను కూడా నిర్దేశించాలని కోరారు. ఆ సమయాలను గేటుపై పెట్టి.. నిరంతరం వాచ్‌మ్యాన్‌లు ఉండేలా చూడాలన్నారు. గతంలో ఇక్కడ చెత్త సేకరణ ఆటోలు పార్కింగ్ చేసేవారని.. వారికి ప్రత్యామ్నాయ పార్కింగ్ ఏరియా చూపించాలని కోరారు. అలాగే బతుకమ్మ కుంట సందర్శనకు వచ్చిన వాహనదారులు కూడా ఇష్టానుసారం వాహనాలను పార్కింగ్ చేయకుండా నియంత్రించాలని సూచించారు. హైడ్రా కమిషనర్‌ను కలిసిన వారిలో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారాయణస్వామి కూడా ఉన్నారు.