|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 02:54 PM
ఆత్మనిర్భర్ భారత్ దిశగా చేపట్టిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో సమాజంలోని అన్నివర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని, ఇది బచత్ ఉత్సవం అని అభివర్ణించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రసంగించారు. ఇటీవల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచామని, దానితోపాటు ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల వల్ల దేశ ప్రజల పొదుపు రూ.2.5 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. భిన్న రకరకాల పన్నుల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించి, ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు.