|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 02:42 PM
BSNL తెలంగాణలో ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) ఆధారంగా ట్రిపుల్ ప్లే సేవలను ప్రారంభించింది. కేవలం రూ.299 నుంచి లభించే ఈ ప్యాక్‌లో ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, ఐపీటీవీ సౌకర్యాలు ఒకేసారి అందుబాటులో ఉంటాయి. హై-స్పీడ్ వైఫై, స్పష్టమైన వాయిస్ కాలింగ్, విభిన్న వినోద ఛానెల్‌లు ఈ ప్యాక్‌లో భాగమని.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు డిజిటల్ కనెక్టివిటీని తక్కువ ధరలో అందించడమే లక్ష్యమని BSNL తెలంగాణ సర్కిల్ సీ.జి.ఎం. రత్నకుమార్ తెలిపారు.