|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 07:06 PM
బీఆర్ఎస్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సభాపతికి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణానికి వెళ్లి శాసనసభ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని కలిశారు.బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని శాసనసభ అదనపు కార్యదర్శికి తెలియజేశారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణను అధికారులు తమకు తెలియజేశారని, వారి వివరణపై బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాన్ని తెలియజేయడానికి మూడు రోజులు గడువు ఇచ్చారని జగదీశ్ రెడ్డి మీడియాకు తెలిపారు.