|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 02:30 PM
నల్లగొండ జిల్లాలో లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులకు ఇటీవల వరస జైలు శిక్షలు వేస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి సంచలన తీర్పు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఓ నిందితుడికి 21ఏళ్ల జైలు శిక్ష, రూ. 30 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. 2018లో నల్లగొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన రాములు పై కేసు నమోదైంది. గత ఏడాది కాలంగా 19 మంది కామాంధులకు కఠిన కారాగార శిక్ష విధించారు.