|
|
by Suryaa Desk | Thu, Jul 31, 2025, 02:21 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతాయన్నారు. దీనికి మూడు నెలలు సమయం ఉందని.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ టీమ్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.