![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 04:22 PM
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో గతేడాది ఫిబ్రవరితోనే సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. దీనిపై దాఖలైన ఆరు పిటిషన్లను జస్టిస్ మాధవి బెంచ్ విచారించింది. ఇవాళ తీర్పు వెల్లడించింది. తెలంగాణలో గతేడాది ఫిబ్రవరితోనే సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. దీనిపై దాఖలైన ఆరు పిటిషన్లను జస్టిస్ మాధవి బెంచ్ విచారించింది. ఇవాళ తీర్పు వెల్లడించింది. పిటిషనర్ల ఏమని వాదించారంటే... గతేడాది ఫిబ్రవరితో సర్పంచుల పదవీ కాలం ముగిసిందని తెలిపారు. ఇన్ని రోజులు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. సర్పంచ్ల స్థానంలో ప్రత్యకే అధికారులను నియమించి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని కోర్టు ముందు ఉదాహరణలతో ఉంచారు. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావడం లేదని వివరించారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయని చాలా మంది సర్పంచ్లు సొంత నిధులతో అభివృద్ధి పనులు చేశారని ఆ నిధులు రాక అప్పులు పాలయ్యారని వాపోయారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు రిక్వస్ట్ చేశారు. పిటిషనర్ల వాదనకు ప్రభుత్వం తరఫున ఏజీ కౌంటర్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియ చేపట్టడానికి టైం పడుతుందని పేర్కొన్నారు. అదనంగా మరో నెలరోజులు గడువు కావాల్సి ఉందన్నారు. ఎన్నికల సంఘం తరఫున కూడా వాదనలు వినిపించిన న్యాయవాది రిజర్వేషన్ల ప్రక్రియతోనే నిర్వహణ ఆలస్యమవుతుందన్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల వచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని కోర్టుకు తెలిపారు. అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల సంఘం కూడా మరో గడువు కోరాయి. అన్నింటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్పు చెప్పింది.