|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 07:24 PM
తెల్లాపూర్ : కుల సంఘాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లాపూర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరనాత చర్చికి 80 గజాలు, నాయి బ్రాహ్మణ సంఘానికి కొమరం భీమ్ కాలనీలో 150 గజాల స్థలాలను కేటాయిస్తూ ఆయా సంఘాల అధ్యక్షులకు ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే జిఎంఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు వీటిని అందజేసినట్టు తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా కుల సంఘాల బాధ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, వెలిమెల పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ప్రభుత్వ ప్లీడర్ ప్రభు, రాగం దేవేందర్ యాదవ్, లచ్చిరామ్ నాయక్, బాబ్జి, శ్రీశైలం, నాగరాజు, శ్రీకాంత్, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.