|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 12:18 PM
ఆధునిక వసతులతో పటాన్చెరు నియోజకవర్గంలో మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నామని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 248 లో ఒక ఎకరా స్థలంలో హెట్రో లేబరేటరీస్ సౌజన్యంతో మూడు కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన మోడల్ పోలీస్ స్టేషన్ పనులకు ఆదివారం ఉదయం మెదక్ ఎంపీ రఘునందన్ రావు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఐజి సత్యనారాయణ గౌడ్, జిల్లా ఎస్పీ పరితోష్ సంతోష్ కుమార్ లతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. మండల కేంద్రమైన గుమ్మడిదల లోను హెట్రో లేబరేటరీస్ సౌజన్యంతో రెండు పోట్లా 50 లక్షల రూపాయలతో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అమీన్పూర్, పటాన్చెరు, కొల్లూరు, పోలీస్ స్టేషన్లను పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికతో పూర్తి స్థాయి వసతులతో వీటిని నిర్మిస్తున్నామని తెలిపారు. నిరు పేద, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు నివసించే పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలతో పాటు సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. పటాన్చెరు నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న హెట్రో లేబరేటరీస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి, పటాన్చెరు డిఎస్పి ప్రభాకర్, హెట్రో లేబరేటరీస్ డైరెక్టర్ జి. మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రవి బాబు, సిఐలు వినాయక్ రెడ్డి, రవీందర్ రెడ్డి, స్వామి గౌడ్, నరేష్, నయిమొద్దీన్, లాలు నాయక్, బొల్లారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, జిన్నారం మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, చంద్రా రెడ్డి, హనుమంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అనిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.