|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 12:00 PM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గాలి అనిల్ కుమార్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి గాలి అనిల్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు.