|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:35 PM
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి పిలుపు మేరకు, 2023 ఎన్నికలలో తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ, ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆరు గ్యారంటీలలో భాగంగా ఇచ్చిన హామీలను జూన్ 2 లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా, బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నియోజకవర్గ మలిదశ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉడుత గంగాధర్ గుప్త శనివారం పిలుపునిచ్చారు.