![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 05:02 PM
ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడులకు ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నట్లు సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా అధికారుల సమాచారం మేరకు ఈ కథనాన్ని ప్రచురించినట్లు తెలిపింది. అయితే, ఈ దాడుల విషయంలో ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకున్నారా లేదా అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదని వెల్లడించింది.ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు నిఘా వ్యవహారాలతో సంబంధమున్న ఒక అధికారి సీఎన్ఎన్కు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ అమెరికా, ఇరాన్‌తో కుదుర్చుకునే అణు ఒప్పందం ద్వారా ఇరాన్‌లోని యురేనియం నిల్వలను పూర్తిగా నిర్మూలించలేకపోతే, దాడుల సంభావ్యత మరింత పెరుగుతుందని సదరు అధికారి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.