|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 01:14 PM
కామారెడ్డి జిల్లా, 20వ వార్డులోని వాంబే కాలనీలో శనివారం ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఆ వార్డు మాజీ కౌన్సిలర్ మరియు వార్డ్ ఇన్‌ఛార్జ్ సంతోష్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా, నిరుపేదలకు ఇందిరమ్మ పథకం కింద ఐదు లక్షల రూపాయల సాయం అందిస్తూ మాట నిలబెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీలకు సంతోష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.