బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 11:16 AM
నగరంలో ఈ రోజు (శనివారం) సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
ర్యాలీ ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం నుంచి సైనిక్ ట్యాంక్ వరకు సాగనుంది. ఈ మార్గం అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్‌ల మీదుగా వెళుతుంది. ఈ సమయంలో ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రాకపోకల్లో అసౌకర్యం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలను అధికారులు కోరారు.