|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 10:24 AM
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.ఇక ఇవాళ నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అలాగే, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వీస్తాయని తెలిపింది.