|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 02:00 PM
జిల్లాలో ధాన్యం కొనుగోలు కార్యక్రమం గతంతో పోలిస్తే ఎంతో వేగంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, రైతుల వద్ద నుండి ధాన్యాన్ని మద్దతు ధరకు సత్వరంగా సేకరిస్తున్నామని తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగంగా వడ్లు సేకరణ జరుగుతోందని, రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియ పట్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతులు నిర్భయంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, అందరికీ మద్దతు ధర చెల్లిస్తామని ఆయన వివరించారు.