|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 02:03 PM
నెన్నెల మండలంలోని పెద్ద లంబాడి తండా శివారులో గల మామిడి తోటలో గుడుంబా తయారీ జరుపుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నెపల్లి మండలం, వీగాం గ్రామానికి చెందిన బుర్స మారయ్య అనే వ్యక్తి నిత్యం ఆ తోటలో నాటు సారా తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న నెన్నెల ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం అక్కడ దాడులు నిర్వహించగా, సుమారు 15 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బుర్స మారయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు.
అధికారులు నాటు సారాను ధ్వంసం చేసినట్లు సమాచారం. గుడుంబా తయారీ, విక్రయంపై ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటోందని పోలీసులు హెచ్చరించారు.