|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 03:04 PM
అభివృద్ది పనులలో వేగం పెంచాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం ఆయన వంగూరు మండలం కొండారెడ్డి పల్లిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పురోగతిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులపై కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి రెండు వరుసల రహదారి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.