|
|
by Suryaa Desk | Thu, Sep 11, 2025, 07:43 AM
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' దాని థియేట్రికల్ విడుదలకు ముందు భారీ సంచలనం సృష్టించింది. హైప్‌కు జోడించి, నాగార్జున, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, మరియు సత్యరాజ్ వంటి ప్రముఖల ఉనికి మరింత హైప్ ని తీసుకువచ్చాయి. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న విడుదలైంది మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను పొందింది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాలుగు దక్షిణ భారత భాషలలో తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషలలో ప్రసారం అవుతోంది. హిందీ వెర్షన్ ప్రస్తుతం అందుబాటులో లేదు మరియు 8 వారాల థియేట్రికల్-టు-ఓOTT విండో తర్వాత ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, రచిత రామ్, కన్నా రవి, మౌరాన్, పూజా హెగ్డే (మోనికా పాటలో), రెబా మోనికా జాన్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ బిగ్గీని నిర్మించింది. అనిరుద్ రవిచాండర్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేశారు.
Latest News