|
|
by Suryaa Desk | Mon, Aug 25, 2025, 08:59 PM
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అఖండ' సీక్వెల్– ‘అఖండ తాండవం’ చిత్రానికి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాపై క్రేజ్ మాత్రం ఊహించని స్థాయిలో ఉంది.'అఖండ' ఘన విజయంతో బాలకృష్ణ కెరీర్‌లో మళ్లీ కొత్త జోష్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.ఇక బాలయ్య–బోయపాటి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులలో మాస్ ఎనర్జీ పెరిగిపోతుంది. అందుకే, సినిమా అవుట్‌పుట్‌పై ప్రేక్షకులే కాదు, సినీ వర్గాలు కూడా భారీ అంచనాలు వేస్తున్నాయి. రికార్డులు బద్దలు కొట్టే చాన్స్ ఇదే అనిపిస్తోంది.అదిలా ఉంటే, బాలకృష్ణ తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే జోడీ ప్రేక్షకులను మళ్లీ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరించేందుకు సిద్ధమవుతోంది.ఈ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ 2 (దసరా సందర్భంగా) లాంచ్ చేయనున్నారని సమాచారం. ప్రారంభోత్సవానికి తర్వలోనే షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బాలకృష్ణ మాత్రమే నటీనటుల జాబితాలో ఖరారు కాగా, మిగతా క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌గా గత హిట్లకు సంగీతం అందించిన తమన్ మళ్లీ బాలయ్యతో చేతులు కలపనున్నారని టాక్.
Latest News