|
|
by Suryaa Desk | Sat, Jun 14, 2025, 03:52 PM
బుల్లితెరపై మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న అల్లం గోపాలరావు అనారోగ్యం కారణంగా ఇవాళ శనివారం ఉదయం 8 గంటలకు ఆయన నివాసంలో మృతి చెందారు. దీంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గోపాలరావు మరణంపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. అల్లం గోపాలరావు కుటుంబం ఆయన నివాసంలో ఉన్న అల్లం గోపాలరావు భౌతిక కాయాన్ని సందర్శించి ప్రముఖులు హాజరవుతూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గొప్పదనం గురించి చెబుతున్నారు. ఇదిలా ఉంటే, 75 సంవత్సరాలు ఉన్న అల్లం గోపాలరావుకు భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్, సునీల్ ఉన్నారు. అల్లం గోపాలరావు అంత్యక్రియలు అల్లం గోపాలరావు పెద్దబ్బాయి అనిల్ పలు సీరియల్స్‌తోపాటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇక నటుడు అల్లం గోపాలరావు అంత్యక్రియలను ఇవాళ సాయంత్రం మహా ప్రస్థానంలో జరగనున్నాయి. సాయంత్రం నాలుగు గంటలు అంత్యక్రియలు చేయనున్నారు. గుప్పెడంత మనసు సీరియల్‌లో అల్లం గోపాలరావు మృతిపట్ల ఆయన కుటుంబానికి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ మేనెజ్‌మెంట్ కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. కాగా, అల్లం గోపాలరావు తెలుగు టీవీ సీరియల్స్‌తో చాలా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా స్టార్ మా ఛానెల్‌లోని టాప్ సీరియల్ గుప్పెడంత మనసులో కీలక పాత్ర పోషించారు అల్లం గోపాలరావు. మంత్రి పాత్రలో గుప్పెడంత మనసు సీరియల్‌లో మినిస్టర్ పాత్రలో అల్లం నారాయణ నటించారు. రిషికి, రిషి కుటుంబానికి అండగా ఉంటూ అన్ని విధాల ప్రోత్సహించే ఈ మంత్రి పాత్రలో గోపాలరావు చాలా చక్కగా నటించారు. అయితే, రీసెంట్‌గానే గుప్పెడంత మనసు సీరియల్ ముగిసిపోయిన విషయం తెలిసిందే. బ్రహ్మముడిలో కూడా అలాగే, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్‌లో కూడా అల్లం గోపాలరావు నటించారు. బ్రహ్మముడిలో జడ్జ్‌గా కెమియో రోల్ చేశారు గోపాలరావు. అనామిక-కల్యాణ్ విడాకుల కేసుకు సంబంధించిన ఎపిసోడ్‌లో న్యాయమూర్తిగా అలరించారు అల్లం గోపాలరావు. సుమారు రెండు మూడు ఎపిసోడ్స్‌లో తన నటనతో బ్రహ్మముడిలో అల్లం నారాయణ ఆకట్టుకున్నారు.
Latest News