|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 02:08 PM
దక్షిణాది చిత్రపరిశ్రమను 20 ఏళ్లుగా శాసిస్తోన్న హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు త్రిష. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించి అనేక విజయాలను అందుకుంది. అన్ని ఇండస్ట్రీలలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 1999లో జోడి చిత్రంలో చిన్న పాత్రతో సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత నీ మనసు నాకు తెలుసు తో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ప్రభాస్ సరసన వర్షం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి సౌత్ ఇండస్ట్రీలో విపరీతంగా అవకాశాలు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా వరుస చిత్రాలతో వెండితెరపై సందడి చేస్తుంది. ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం.. చేతినిండా లతో కుర్ర హీరోయిన్లకు గుబులు పుట్టిస్తోంది. ఈ ఏడాది వరుసగా హ్యాట్రిక్ హిట్టు కొట్టిన త్రిష.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగు, తమిళంలో చిత్రాల్లో కనిపించనుంది. ఇదిలా ఉంటే.. గతంలో త్రిషకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో విజయ్ దళపతి ఫోటోను చూపిస్తూ పలు ప్రశ్నలు అడిగారు యాంకర్. దీంతో విజయ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. "విజయ్ ఓ చాలా డిఫరెంట్.. షూటింగ్ సమయంలో అతడు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అందుకే అతడిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. కానీ కోసం ఎంతో కష్టపడుతుంటారు. అతడు ఎల్లప్పుడూ నాకు సరికొత్తగా కనిపిస్తుంటారు" అంటూ చెప్పుకొచ్చింది. విజయ్, త్రిష కలిసి దాదాపు 5కి పైగా ల్లో నటించారు. గిల్లీ, తిరుపాచి, ఆది, కురువి, లియో చిత్రాల్లో నటించారు.
Latest News