|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 06:57 PM
దర్శకుడు పూర్వాజ్ మరో గ్రిప్పింగ్ ప్రాజెక్ట్ 'కిల్లర్' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. పూర్వాజ్ హీరో పాత్రను పోషిస్తుండగా, జ్యోతి పూర్వాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై గ్లింప్సె భారీ అంచనాలని పెంచింది మరియు అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి మీట్ రక్తిక అనే కాప్షన్ తో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. కిల్లర్ పార్ట్ 1 కోసం షూటింగ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా కిల్లర్ పార్ట్ 1 చిరస్మరణీయమైన సినిమా అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. విశాల్ రాజ్ మరియు గౌతమ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్వాజ్, ప్రజయ్ కామత్, మరియు ఎ. పద్మనాభా రెడ్డి థింక్ సినిమా బ్యానర్ కింద ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News